1. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) దేశవ్యాప్తంగా 4,000 పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఇటీవల కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్ 2021 (SSC CHSL 2021) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అభ్యర్థులు 2022 మార్చి 7 రాత్రి 11 గంటల్లోగా అప్లై చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ (JSA), పోస్టల్ అసిస్టెంట్ (PA), సార్టింగ్ అసిస్టెంట్ (SA), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO), డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ పోస్టుల్ని భర్తీ చేస్తోంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. సుమారు 4,000 పైగా పోస్టులు ఉంటాయని అంచనా. (ప్రతీకాత్మక చిత్రం)
4. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్ 2021 (SSC CHSL 2021) మూడు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. టైర్ 1 లో మొత్తం 200 మార్కులకు నాలుగు సెక్షన్స్ ఉంటాయి. ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటీవ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ టాపిక్స్‌పై ప్రశ్నలు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇంగ్లీష్‌లో 25 ప్రశ్నలకు 50 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్‌లో 25 ప్రశ్నలకు 50 మార్కులు, క్వాంటిటేటీవ్ యాప్టిట్యూడ్‌లో 25 ప్రశ్నలకు 50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్‌లో 25 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి. ఇది ఆబ్జెక్టీవ్ బేస్డ్ టెస్ట్. ప్రతీ సరైన సమాధానానికి రెండు మార్కులు ఉంటాయి. తప్పు సమాధానానికి 0.5 నెగిటీవ్ మార్క్ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇక రెండో దశలో డిస్క్రిప్టీవ్ పేపర్ ఉంటుంది. ఇది 100 మార్కులకు ఉంటుంది. సమయం ఒక గంట. ఎస్సే, లెటర్ రైటింగ్, అప్లికేషన్ లాంటి టాపిక్స్ ఉంటాయి. కనీసం 33 శాతం మార్కులు సాధిస్తే క్వాలిఫై అవుతారు. ఇంగ్లీష్ లేదా హిందీలో రాయొచ్చు. ఇక మూడో దశలో స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)