ఇటీవల స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ (SSC CGL)నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తజాగా ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పరీక్ష తేదీలను విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. SSC CGL టైర్ వన్ పరీక్ష డిసెంబర్ 01 నుండి డిసెంబర్ 13, 2022 వరకు నిర్వహించబడుతుందని కమిషన్ పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
SSC CGL పరీక్ష 2022 కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు షెడ్యూల్ని తనిఖీ చేయడానికి అధికారిక ssc.nic.in వెబ్సైట్ను సందర్శించవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ టైర్ వన్(Tier 1) ఎగ్జామినేషన్ 2022 తేదీలను ప్రకటించగా.. అడ్మిట్ కార్డ్ విడుదలకు సంబంధించి మాత్రం ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
టైర్ 2 ఎగ్జామ్లో అర్హత సాధించిన వారికి కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఉంటుంది. అన్ని దశల్లో టాప్లో నిలిచిన అభ్యర్ధులకు చివరిగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. సీజీఎల్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వారిని కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను బట్టి ఆఫీసర్లుగా నియమిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)