1. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు (Central Govt Jobs) కోరుకునేవారికి అలర్ట్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఇటీవల కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL) ఎగ్జామ్ 2022 కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) ద్వారా 20,000 పైగా పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఇవన్నీ డిగ్రీ అర్హతతో భర్తీ చేస్తున్న పోస్టులే. (ప్రతీకాత్మక చిత్రం)
2. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో గ్రూప్ బీ, గ్రూప్ సీ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఈ పోస్టులకు అక్టోబర్ 8న దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుందని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ముందే ప్రకటించింది. అయితే అభ్యర్థుల నుంచి పోటీ ఎక్కువగా ఉండటంతో దరఖాస్తు గడువును పొడిగించింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఆసక్తి గల అభ్యర్థులు 2022 అక్టోబర్ 13 రాత్రి 11 గంటల్లోగా దరఖాస్తు చేయొచ్చు. అక్టోబర్ 13 రాత్రి 11 గంటల లోపు ఆఫ్‌లైన్ చలానా జనరేట్ చేయాలి. అక్టోబర్ 14 రాత్రి 11 గంటల్లో ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ చేయాలి. అక్టోబర్ 15 బ్యాంక్ వేళలు ముగిసే వరకు చలానా పేమెంట్ చేయాలి. అక్టోబర్ 19 నుంచి అక్టోబర్ 20 రాత్రి 11 గంటల వరకు దరఖాస్తు ఫామ్ కరెక్షన్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. 2022 డిసెంబర్లో కంప్యూటర్ బేస్డ్ టియర్ 1 ఎగ్జామినేషన్ జరగనుంది. ఇక కంప్యూటర్ బేస్డ్ టియర్ 2 ఎగ్జామినేషన్ తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ త్వరలో వెల్లడించనుంది. విద్యార్హతల వివరాలు చూస్తే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి. కొన్ని పోస్టులకు ఇతర అర్హతలు కూడా ఉన్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. అభ్యర్థుల వయస్సు వేర్వేరు పోస్టులకు వయస్సు వేర్వేరుగా ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.100. ఎంపికైనవారికి రూ.1,51,100 వరకు వేతనం లభిస్తుంది. డిగ్రీ అర్హతతో భర్తీ చేస్తున్న పోస్టులు కాబట్టి పోటీ తీవ్రంగా ఉంటుంది. ఈ పోస్టులకు అభ్యర్థులు https://ssc.nic.in/ వెబ్సైట్లో అప్లై చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. https://ssc.nic.in/ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత వన్ టైమ్ రిజిస్ట్రేషన్ కోసం New User? Register Now పైన క్లిక్ చేయాలి. మీ పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు లాంటి బేసిక్ డీటెయిల్స్‌తో మొదటి ఫామ్ పూర్తి చేయాలి. తర్వాతి స్టెప్‌లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మూడో స్టెప్‌లో ఫోటో, సంతకం అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ముందే వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసినవారు నేరుగా లాగిన్ కావొచ్చు. రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా లాగిన్ అయిన తర్వాత మీరు అప్పటికే పూర్తి చేసిన వివరాలు కనిపిస్తాయి. ఆ వివరాల్లో ఏవైనా మార్పులు ఉంటే ఎడిట్ చేయొచ్చు. ఆ తర్వాత కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్-CGL నోటిఫికేషన్‌కు అప్లై చేయాలి. ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఈ నోటిఫికేషన్ ద్వారా సుమారు 20,000 పోస్టుల్ని భర్తీ చేస్తామని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను https://ssc.nic.in వెబ్సైట్లో Candidate’s Corner సెక్షన్లో Tentative Vacancy సెక్షన్లో అప్డేట్ చేస్తుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. అభ్యర్థులు ఈ వెబ్సైట్ మాత్రమే ఫాలో కావాలి. (ప్రతీకాత్మక చిత్రం)