1. రైల్వేలో ఉద్యోగాలు కోరుకునే నిరుద్యోగులకు శుభవార్త. దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) పలు ఖాళీల భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 21 ఖాళీలను ప్రకటించింది. స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. పలు క్రీడల్లో రాణించినవారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
2. బాక్సింగ్, క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్ లాంటి క్రీడల్లో రాణించినవారై ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 జనవరి 17 చివరి తేదీ. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఖాళీల వివరాలు చూస్తే మొత్తం 21 ఖాళీలు ఉన్నాయి. అథ్లెటిక్స్ (మెన్)- 2, అథ్లెటిక్స్ (వుమెన్)- 2, బాల్ బ్యాడ్మింటన్ (మెన్)- 2, బాస్కెట్ బాల్ (మెన్)- 2, బాస్కెట్ బాల్ (వుమెన్)- 1, బాక్సింగ్ (మెన్)- 1, క్రికెట్ (మెన్)- 1, హ్యాండ్‌బాల్ (మెన్)- 1, హ్యాండ్‌బాల్ (వుమెన్)- 1, హాకీ (మెన్)- 1, కబడ్డీ (మెన్)- 1, ఖోఖో (మెన్)- 1, వాలీబాల్ (మెన్)- 2, వాలీబాల్ (వుమెన్)- 1, వెయిట్‌లిఫ్టింగ్ (మెన్)- 1 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. విద్యార్హతల వివరాలు చూస్తే టెక్నికల్ పోస్టులకు ఎస్ఎస్సీ పాస్ కావాలి. లేదా సంబంధిత గ్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. ఇతర పోస్టులకు 10+2 లేదా ఇంటర్మీడియట్ పాస్ కావాలి. దరఖాస్తు ఫీజు రూ.500. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనార్టీలు, ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అభ్యర్థులకు ఫీజు రూ.250. అభ్యర్థుల వయస్సు 2022 జనవరి 1 నాటికి 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. క్రీడార్హతల వివరాలు చూస్తే ఒలింపిక్ గేమ్స్, వాల్డ్ కప్, వాల్డ్ ఛాంపియన్షిప్స్, ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, యూత్ ఒలింపిక్స్, డేవిస్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, థామర్, ఉబెర్ కప్, కామన్వెల్త్ ఛాంపియన్షిప్స్, ఏషియన్ ఛాంపియన్షిప్స్, ఏషియా కప్, సౌత్ ఏషియన్ ఫెడరేషన్ గేమ్స్, వాల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో రాణించినవారై ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ముందుగా https://scr.indianrailways.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో Online application for recruitment under Sports Quota for the year 2021-22 లింక్ పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో New User Registration పైన క్లిక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, పుట్టిన తేదీ లాంటి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ తర్వాత యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయాలి.
అడ్రస్, విద్యార్హతలు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి. లేటెస్ట్ ఫోటో, సంతకం, విద్యార్హతల సర్టిఫికెట్స్, క్రీడార్హతల సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి. దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసి భద్రపర్చుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)