జూన్ 20 నుంచి ఆన్లైన్లో అప్లికేషన్లు మొదలవ్వగా.. జులై 10 వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు స్వీకరణ ముగిసింది. నోటిపికేషన్లో(Notification) అర్హతలు, ఉద్యోగాల వారీగా ఖాళీలు, అప్లికేషన్ ఫీజు(Application Fee), ఎంపిక విధానం మొత్తం వివరంగా ఇచ్చినా.. పరీక్ష తేదీ మాత్రం ఇవ్వలేదు. దీనిని తర్వాత వెబ్ సైట్లో అప్ డేట్ చేశారు.
అయితే దీనికి సంబంధించి హాల్ టికెట్లకు సంబంధించి మరో అప్ డేట్ ను వెట్ సైట్లో పొందుపరిచారు. ఆగస్టు 28 నుంచి జూనియర్ అసిస్టెంట్ హాల్ టికెట్స్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఆ సంస్థ డైరెక్టర్ (పర్సనల్) ఎస్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని https://tssccl.onlineportal.org.in/ఈ వెబ్ సైట్లో తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
సింగరేణి ఉద్యోగాలు పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తామని ఆ సంస్థ డైరెక్టర్ (పర్సనల్) ఎస్ చంద్రశేఖర్ గురువారం ఓ ప్రకటనలో తెలియజేశారు. సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇప్పిస్తామని కొందరు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసిందని.. అటువంటి వాళ్ల మాయమాటలు నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దని సూచించారు.