సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(Singareni Collieries Company Limited) 177 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 20th జూన్ 2022న రిక్రూట్మెంట్ నోటిఫికేషన్(Notification) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్లరికల్ జాబ్ నాన్ఎగ్జిక్యూటివ్ కేడర్లోకి(Clerical Cadre Non Executive Cadre)వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
జూన్ 20 నుంచి ఆన్లైన్లో అప్లికేషన్లు మొదలవ్వగా.. జులై 10 వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు స్వీకరణ ముగిసింది. నోటిపికేషన్లో(Notification) అర్హతలు, ఉద్యోగాల వారీగా ఖాళీలు, అప్లికేషన్ ఫీజు(Application Fee), ఎంపిక విధానం మొత్తం వివరంగా ఇచ్చినా.. పరీక్ష తేదీ మాత్రం ఇవ్వలేదు. దీనిని తర్వాత వెబ్ సైట్లో అప్ డేట్ చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
వీటిలో మెరిట్ లో మార్కులు వచ్చిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కొరకు పిలుస్తారు. పరీక్షలో అభ్యర్థులను ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆప్టిట్యూట్, జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ తెలంగాణ హిస్టరీ, కల్చర్ అండ్ హెరిటేజ్, అర్థమేటిక్ అప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ పై ప్రశ్నలను అడుగుతారు. (ప్రతీకాత్మక చిత్రం)