1. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. జనరల్ స్ట్రీమ్‌లో గ్రేడ్ ఏలో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 100 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. (ప్రతీకాత్మక చిత్రం)
2 ఈ పోస్టులకు అప్లై చేయడానికి 2022 మార్చి 24 చివరి తేదీ. ఏప్రిల్‌లో ఆన్లైన్ ఎగ్జామ్, మేలో ఇంటర్వ్యూలు ఉంటాయి. బ్యాచిలర్స్ డిగ్రీ పాసైనవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. అభ్యర్థులు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేయాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు మొత్తం 100 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీ- 43, ఎస్సీ- 16, ఎస్టీ- 7, ఓబీసీ- 24, ఈడబ్ల్యూఎస్- 10 పోస్టులున్నాయి. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్) లేదా మాస్టర్స్ డిగ్రీ (కామర్స్, ఎకనమిక్స్, మేనేజ్మెంట్) పాస్ లేదా సీఏ, సీఎస్, సీడబ్ల్యూఏ, సీఎఫ్ఏ లేదా పీహెచ్డీ పాస్ కావాలి. కనీసం 60 శాతం మార్కులతో పాస్ కావాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ముందుగా నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. ఆ తర్వాత అభ్యర్థులు https://www.sidbi.in/en/ వెబ్సైట్లో కెరీర్స్ సెక్షన్ ఓపెన్ చేయాలి. SIDBI invites Applications for Recruitment of Officers in Grade ‘A’– General Stream లింక్ పైన క్లిక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)