SCHOOLS AND COLLEGES TO REOPEN FROM OCTOBER 15 UNION MINISTRY OF EDUCATION RELEASED COVID 19 GUIDELINES SS
Schools Reopen: వచ్చే వారం నుంచి స్కూల్స్... గైడ్‌లైన్స్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
Schools Reopen | వచ్చే వారం నుంచి బడిగంటలు మోగనున్నాయి. కోవిడ్ 19 కారణంగా మూతపడ్డ పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గైడ్‌లైన్స్ విడుదల చేసింది.
1. దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు తెరిచేందుకు కేంద్ర విద్యా శాఖ గైడ్‌లైన్స్ విడుదల చేసింది. అన్‌లాక్ 5.0 లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 15 నుంచి పాఠశాలలు, కాలేజీలు పరిమితంగా తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
2. అక్టోబర్ 15 నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోనున్నాయి. అయితే వచ్చే వారం నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరవాలా వద్దా అన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
3. స్కూళ్లు రీఓపెన్ చేసేందుకు కేంద్ర విద్యా శాఖ జారీ చేసిన గైడ్‌లైన్స్‌ని అనుసరించి ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌ని రూపొందించాలని, స్థానిక పరిస్థితులను బట్టి ఇవి ఉండాలని విద్యా శాఖ సూచించింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
4. విద్యార్థులు స్వచ్ఛందంగా స్కూళ్లకు వచ్చేందుకు అనుమతి ఇవ్వాలి. స్కూలుకు వచ్చిన విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి సమ్మతి పత్రం తీసుకోవాలి. కంటైన్మెంట్ జోన్లలో ఉన్న విద్యార్థులు స్కూళ్లకు రాకూడదు. (ప్రతీకాత్మక చిత్రం)
6. స్కూళ్లలో ఎమర్జెన్సీ కేర్ సపోర్ట్, సపోర్ట్ లేదా రెస్పాన్స్ టీమ్, హైజీన్ టీమ్ లాంటి బృందాలను ఏర్పాటు చేయాలి. సోషల్ డిస్టెన్సింగ్ పాయించాలి. అందుకు తగ్గట్టుగా సీటింగ్ అరేంజ్మెంట్ ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
7. స్టాగర్డ్ మ్యానర్ అంటే అస్థిర పద్ధతిలో ఎంట్రీ, ఎగ్జిట్ టైమింగ్స్ ఉండాలి. ఎంట్రీకి, ఎగ్జిట్‌కు వేర్వేరు గేట్స్ ఉండాలి. ఇక కరోనా వైరస్ మహమ్మారిని నివారించేందుకు పాటించాల్సిన జాగ్రత్తలన్నీ పాటించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
8. విద్యార్థులు, సిబ్బంది మాస్కులు ధరించాలి. చేతులు కడుక్కోవాలి. ఫర్నీచర్, స్టోరేజ్, వాటర్ ట్యాంక్స్, కిచెన్, క్యాంటీన్, ల్యాబరేటరీ, లైబ్రరీ, వాష్రూమ్స్లు శుభ్రంగా ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 9
9. ఈ ఏడాది మొత్తాన్ని ప్లాన్ చేస్తూ ప్రత్యామ్నాయ క్యాలెండర్‌ను స్కూళ్లు రూపొందించాలి. (ప్రతీకాత్మక చిత్రం)