తెలంగాణలో కరోనా ఎఫెక్ట్ తో గత మార్చిలో మూతబడిన పాఠశాలలు ఈ సోమవారం(ఫిబ్రవరి 1) నుంచి తెరుచుకోనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణలో కరోనా ఎఫెక్ట్ తో గత మార్చిలో మూతబడిన పాఠశాలలు ఈ సోమవారం(ఫిబ్రవరి 1) నుంచి తెరుచుకోనున్నాయి. 9, 10వ తరగతి విద్యార్థులకు క్లాసులు నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
వివిధ జిల్లాల కలెక్టర్లు శుక్రవారం పలు పాఠశాలలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. రాజన్నసిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్ వేములవాడ, చందుర్తి మండలంలోని పలు పాఠశాలలను సందర్శించారు. పాఠశాలలో నిర్వహిస్తున్న పారిశుధ్య పనులను పరిశీలించారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలను అధికారులు శుభ్రం చేయిస్తున్నారు. వికారాబాద్ కలెక్టర్ సైతం పలు పాఠశాలలను పరిశీలించారు. పాఠశాలల్లోని వంటగది, డ్రింకింగ్ వాటర్ సదుపాయాలు, టాయిలెట్లు, ఐసోలేషన్ గదులను పరిశీలించారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
ప్రతీ బేంచ్ కు ఒక విద్యార్థిని మాత్రమే కూర్చోబెట్టాలని అధికారులు ఉపాధ్యాయులకు సూచించారు. తమ పిల్లలను పంపించడానికి తల్లిదండ్రుల నుంచి అంగీకర పత్రాలను సైతం స్వీకరిస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
పాఠశాలల్లో హ్యాండ్ వాష్, శానిటైజర్లు, సబ్బులు, థర్మోమీటర్లను అందుబాటులో ఉంచుతున్నారు. విద్యార్థుల మధ్య ఆరు మీటర్ల దూరం ఉండేలా క్లాస్ రూముల్లో ఏర్పాట్లు చేస్తున్నట్లు నాగర్ కర్నూల్ కలెక్టర్ తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
విద్యార్థులు విధిగా ప్రత్యక్ష తరగతులకు హాజరుకావాలన్న నిబంధనేమీ లేదని ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. తల్లిదండ్రుల సమ్మతి ఉంటేనే తరగతులకు అనుమతిస్తామన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
తమ పిల్లలను స్కూళ్లకు పంపించేందుకు ఇప్పటికే 60 శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులు అంగీకరించారని మంత్రి వివరించారు. విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ చేయాలని, క్లాస్ రూంలను ప్రతీ రోజు శానిటైజ్ చేయించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
తమ పిల్లలను పాఠశాలలకు పంపించాలన్న భవన కల్పించాలని సూచించారు.(ప్రతీకాత్మక చిత్రం)