Students Scholarship | స్కాలర్షిప్స్ గురించి మనకు తెలుసు. మనలో చాలా మంది స్కాలర్షిప్స్ పొందే ఉంటారు. ఉపకారవేతనాల ముఖ్య ఉద్దేశం విద్యార్థులకు (Students) ఆర్థిక సాయం అందించడమే. స్కాలర్షిప్ను స్కూల్ నుంచి యూనివర్సిటీలో చదివే వారి వరకు పొందొచ్చు. స్కాలర్షిప్స్ (Scholarship) అనేవి స్టూడెంట్స్ విద్యకు అవసరమైన పూర్తి డబ్బులను లేదా అందులో కొంత భాగం వరకు అందించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఈ నెలలో గడువు ముగియనున్న పలు స్కాలర్షిప్స్ ఏంటివో ఒకసారి తెలుసుకుందాం.
పీజీ ఇందిరా గాంధీ స్కాలర్షిప్ ఫర్ సింగిల్ గర్ల్ చైల్డ్‌ను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తీసుకువచ్చింది. కుటుంబంలో ఒకే ఆడ పిల్ల ఉంటే ఆ బాలికలకు ఈ పథకం వర్తిస్తుంది. పీజీ కోర్సులో చేరిన అమ్మాయిలకు ఏడాదికి రూ. 36,200 మేర ఫెల్లోషిప్ లభిస్తుంది. 30 ఏళ్ల వరకు వయసు కలిగిన అమ్మాయిలు ఈ స్కాలర్షిప్ కోసం అప్లై చేసుకోవచ్చు. scholarships.gov.in ద్వారా అక్టోబర్ 31లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
పీజీ స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ అనే పథకాన్ని కూడా యూజీసీ తీసుకువచ్చింది. ఇది ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్‌కు వర్తిస్తుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే వారు ఈ స్కాలర్షిప్ కోసం అప్లై చేసుకోవచచు. ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, మేనేజ్మెంట్ అండ్ ఫార్మసీ వంటి ఇతర కోర్సులు చేసే వారు అప్లై చేసుకోవచ్చు.
టీఎస్ఎస్ ఆత్మనిర్భర్ స్కాలర్షిప్ కూడా ఉంది. 2022-23 బీఈ, బీటెక్ కోర్సులకు ఇది వర్తిస్తుంది. బీఈ, బీటెక్ ప్రోగామ్స్‌లో అడ్మిషన్ తీసుకునే వారు ఈ స్కాలప్షిప్ బెనిఫిట్ పొందొచ్చు. అయితే 10, 12వ తరగతి సహా గ్రాడ్యుయేషన్‌లో 60 శాతానికి పైగా మార్కులు వచ్చి ఉండాలి. వీరి కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలకు లోపు ఉంటేనే స్కాలర్షిప్ వస్తుంది. ఒక సంవత్సరానికి రూ. 30 వేలు లభిస్తాయి. vidyasaarathi.co.in ద్వారా ఈ నెల చివరిలోపు స్కాలర్షిప్ కోసం అప్లై చేసుకోవచ్చు.
జీఎస్కే స్కాలర్స్ ప్రోగ్రామ్ 2022-23 అనేది సీఎస్ఆర్ కార్యక్రమం. గ్లాక్సోస్మిత్‌క్లిన్ అనే ఫార్మా కంపెనీ ఈ స్కాలర్షిప్ అందిస్తోంది. ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ చదివే వారు ఈ స్కాలర్షిప్ కోసం అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ కాలేజీల్లో చదువుతూ ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలకు లోపు ఉండాలి. 12వ తరగతిలో 65 శాతం మార్క్‌లు వచ్చి ఉండాలి. ప్రతి ఏటా రూ.లక్ష వస్తాయి. 4.5 ఏళ్ల వరకు డబ్బులు వస్తూనే ఉంటాయి. అక్టోబర్ 15 వరకు అప్లై చేసుకోవడానికి గడువు ఉంది. బుడ్డీ4స్టడీ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
ఏఐసీటీసీ అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్స్లో చదివే వారికే స్కాలర్షిప్ వస్తుంది. వార్షిక ఆదాయం రూ.8 లక్షలకు పైన ఉండకూడదు. అంగవైకల్యం 40 శాతానికి తక్కువ ఉండకూడదు. ఈ స్కాలర్షిప్ స్కీమ్ కింద అర్హులకు ఏటా రూ. 50 వేలు లభిస్తాయి. ఇలా నాలుగేళ్లు పొందొచ్చు. scholarships.gov.in ద్వారా అక్టోబర్ 31లోపు అప్లై చేసుకోవచ్చు.