దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో జాబ్ అంటే యువతలో భారీ క్రేజ్ ఉంటుంది. ఈ బ్యాంకులో ఉద్యోగాలకు ప్రభుత్వ ఉద్యోగాలతో సమానంగా పోటీ ఉంటుంది. అందుకే ఈ బ్యాంకులో ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా లక్షలాది మంది నిరుద్యోగులు ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలాంటి వారికి ఇటీవల శుభవార్త చెప్పింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI). (ప్రతీకాత్మక చిత్రం)
భారీగా ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ (SBI PO Notification) విడుదల చేసింది. మొత్తం 1673 పీఓ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్ సైట్లో ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
మొత్తం 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు గాను ఇందులో రెగ్యులర్ పోస్టులు 1600 ఉండగా.. బ్యాక్లాగ్ పోస్టులు మరో 73 వరకు ఉన్నాయి. విద్యార్హతలు: ఈ ఉద్యోగాలకు విద్యార్హతను డిగ్రీగా నిర్ణయించారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి డిగ్రీ విద్యార్హత పొందిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
దరఖాస్తుదారుల వయస్సు ఏప్రిల్ 1, 2022 నాటికి 21-30 ఏళ్లు ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ముఖ్యమైన తేదీలు: ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు అంటే సెప్టెంబర్ 22న ప్రారంభం కాగా.. దరఖాస్తుకు ఆఖరి తేదీగా అక్టోబర్ 12ను నిర్ణయించారు. (ప్రతీకాత్మక చిత్రం)