1. బ్యాంకు ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) భారీగా ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసిన సంగతి తెలిసిందే. త్వరలో దరఖాస్తు గడువు ముగియనుంది. పలు రాష్ట్రాల్లో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఎస్బీఐ ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా రెగ్యులర్ పోస్టులతో పాటు బ్యాక్లాగ్ వేకెన్సీస్ని భర్తీ చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. మొత్తం 1,226 పోస్టులున్నాయి. ఇందులో రెగ్యులర్ పోస్టులు 1100 ఉండగా, బ్యాక్లాగ్ పోస్టులు 126 ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, తమిళనాడు, రాజస్తాన్ రాష్ట్రాల్లో ఖాళీలను భర్తీ చేస్తోంది. అభ్యర్థులు ఏదైనా ఒక రాష్ట్రంలోని పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేయాలి. రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా దరఖాస్తులు సబ్మిట్ చేస్తే అప్లికేషన్స్ స్వీకరించరు. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఈ పోస్టులకు 2021 డిసెంబర్ 9న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 29 చివరి తేదీ. దరఖాస్తులు ఎడిట్ చేయడానికి 2021 డిసెంబర్ 29 చివరి తేదీ. దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి 2022 జనవరి 13 చివరి తేదీ. అభ్యర్థులకు 2022 జనవరిలో ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. 2022 జనవరి 12 నుంచి నుంచి కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఖాళీల వివరాలు చూస్తే మొత్తం 1,226 పోస్టులున్నాయి. అహ్మదాబాద్లో 300 రెగ్యులర్ పోస్టులు ఉండగా 54 బ్యాక్లాగ్ ఖాళీలున్నాయి. బెంగళూరులో 250 రెగ్యులర్ పోస్టులు ఉండగా 28 బ్యాక్లాగ్ ఖాళీలున్నాయి. భోపాల్లో 150 రెగ్యులర్ పోస్టులు ఉండగా 12 బ్యాక్లాగ్ ఖాళీలున్నాయి. భోపాల్లో 50 రెగ్యులర్ పోస్టులు ఉండగా 2 బ్యాక్లాగ్ ఖాళీలున్నాయి. చెన్నైలో 250 రెగ్యులర్ పోస్టులు ఉండగా 26 బ్యాక్లాగ్ ఖాళీలున్నాయి. జైపూర్లో 100 రెగ్యులర్ పోస్టులు ఉండగా 4 బ్యాక్లాగ్ ఖాళీలున్నాయి. (Source: Officail Notification)
5. విద్యార్హతల వివరాలు చూస్తే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి. ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా రీజనల్ రూరల్ బ్యాంకులో రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ సబ్సిడరీస్లో పనిచేస్తున్నవారు, ఎస్బీఐలో క్లరికల్, సూపర్వైజర్ కేడర్లో పనిచేసినవారు, ఎస్బీఐలో ఆఫీసర్ గ్రేడ్ నుంచి రిజైన్ చేసినవారు దరఖాస్తు చేయకూడదు. (ప్రతీకాత్మక చిత్రం)
6. అభ్యర్థుల వయస్సు 2021 డిసెంబర్ 1 నాటికి 21 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు, దివ్యాంగులకు ఫీజు లేదు. ఈ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి రూ.36,000 బేసిక్ వేతనంతో మొత్తం రూ.63,840 లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
9. ఐదో దశలో ఐడీ ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, రెజ్యూమె, విద్యార్హతల సర్టిఫికెట్స్, ఎక్స్పీరియెన్స్ సర్టిఫికెట్స్, సాలరీ స్లిప్, ఫామ్ 16 లాంటి ఇతర సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి. ఆరో దశలో ఫీజు పేమెంట్ చేయాలి. చివరగా అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి భద్రపర్చుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)