1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI మరోసారి భారీగా అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 6100 పోస్టులున్నాయి. తెలంగాణలో 125, ఆంధ్రప్రదేశ్లో 100 ఖాళీలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. అప్రెంటీస్ పోస్టులకు డిగ్రీ అర్హత కావడంతో లక్షల్లో అభ్యర్థులు అప్లై చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఆగస్టులో ఎగ్జామ్ ఉంటుంది. మరి ఈ పోస్టులకు ఎస్బీఐ ఎలా ఎంపిక చేస్తుంది? సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ ఏ విధంగా ఉంటుంది? అన్న అనుమానాలు అభ్యర్థుల్లో ఉన్నాయి. మరి ఎస్బీఐలో అప్రెంటీస్ పోస్టులకు ఎలా ఎంపిక చేస్తారో, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో, ఏఏ టాపిక్స్ ప్రిపేర్ కావాలో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)