సరస్వత్ సహకర బ్యాంక్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా క్లర్క్ కేడర్‌లో 150 జూనియర్ ఆఫీసర్స్ (మార్కెటింగ్ & ఆపరేషన్) పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 8తో ముగుస్తుంది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.saraswatbank.com ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరు . ఎంపికైన అభ్యర్థులు ముంబయ్ లో పని చేయాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
ఖాళీల వివరాలు ఈ బ్యాంక్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో మొత్తం 150 ఖాళీలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ ఖాళీలో.. జూనియర్ ఆఫీసర్ మార్కెటింగ్ పోస్టులకు సంబంధించి నియామకాలు జరుగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
అర్హతలు.. దరఖాస్తు చేసే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
5/ 6
దరఖాస్తు ప్రక్రియ ఇలా.. ముందుగా అభ్యర్థలు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. దాని కోసం ఈ లింక్ saraswatbank.com ను ఉపయోగించండి. ఆ తర్వాత కెరీర్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
అక్కడ ఓపెన్ చేసిన దరఖాస్తు ఫారమ్ లో వివరాలను నమోదు చేయండి. అవసరమైన అన్ని పత్రాలను అప్లోడ్ చేయండి. తర్వాత ఫారమ్‌ను సమర్పించి, భవిష్యత్తు సూచన కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)