Sankranti Holidays: విద్యార్థులకు అలర్ట్.. రేపటి నుంచి సంక్రాంతి సెలవులు షురూ..
Sankranti Holidays: విద్యార్థులకు అలర్ట్.. రేపటి నుంచి సంక్రాంతి సెలవులు షురూ..
రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రముఖ పండుగల్లో సంక్రాంతి ఒకటి. బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడో స్థిరపడ్డ వారంతా ఈ పండుగ నాడు మాత్రం సొంతూరుకు చేరుకుంటారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రముఖ పండుగల్లో సంక్రాంతి ఒకటి. బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడో స్థిరపడ్డ వారంతా ఈ పండుగ నాడు మాత్రం సొంతూరుకు చేరుకుంటారు. ప్రభుత్వాలు సైతం ఈ పండుగకు భారీగా సెలవులు ఇస్తూ ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పండుగ సంబరాలు జరిగే తీరే వేరు. అంతే కాకుండా.. తెలంగాణలో కూడా ఈ సంక్రాతి పండుగను వైభవంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు పాఠశాలలకు, కాలేజీలకు సెలవులను ప్రకటించాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఏపీలో జనవరి 11వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి (జనవరి 11) నుంచి ఏపీ ఇంటర్ కాలేజీలకు ప్రారంభం కానుండగా.. జనవరి 17 వరకు ఈ సెలవులు ముగుస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
ఇక ఈ జూనియర్ కాలేజీలు జనవరి 18న పున:ప్రారంభం అవుతాయి. ఇలా మొత్తం కాలేజీలకు 7 రోజుల పాటు సెలవులను ప్రకటించారు. స్కూళ్ల విషయానికి వస్తే.. జనవరి 12 నుంచి జనవరి 18 వరకు సెలవులను ప్రకటించారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
స్కూళ్లకు కూడా వారం రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. కాలేజీలకు జనవరి 14 నుంచి 16వరకు మాత్రమే ఇచ్చారు. అంటే భోగీ, సంక్రాంతి, కనుమ రోజుల్లో సెలవులు ప్రకటించారు. మంత్రి సబిత (ఫైల్)
6/ 6
తెలంగాణ స్కూళ్ల విషయానికి వస్తే.. ఒక రోజు ముందుగా స్టార్ట్ అవుతాయి. అంటే జనవరి 13 నుంచి జనవరి 17 వరకు 5 రోజులు సెలవులు మంజూరు చేశారు. వీటితో పాటు.. ఈనెలలో ఇంకా రిపబ్లిక్ డే, రెండో శనివారం, ఆదివారం కలిపి భారీగా సెలవులు వచ్చాయి. (ప్రతీకాత్మక చిత్రం)