కరోనా (Corona) విజృంభించిన తరువాత చాలా సంస్థలు తమ ఉద్యోగుల జీతాలను తగ్గించాయి. ఇక జీతాల పెరుగుదల కరోనా కాలంలో దాదాపు చాలా సంస్థలలో అందని ద్రాక్షగా మారింది. అయితే టీమ్‌లీజ్ (Team lease) లేటెస్ట్ సర్వే(Latest Servey) ప్రకారం మళ్లీ ఇప్పుడు కోవిడ్ ముందునాటి విధంగా సంస్థలు తమ ఉద్యోగుల జీతాలను పెంచుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
టీమ్‌లీజ్ శాలరీ ప్రైమర్ రిపోర్ట్ (Teamlease Salary Primer Report) 8 ఫంక్షన్స్, 2,63,000 తాత్కాలిక ప్రొఫైల్‌లు, 17 పరిశ్రమలు, 9 నగరాల్లో ఉద్యోగాలు, పేఔట్ ట్రెండ్లను కవర్ చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం సూపర్ స్పెషలైజ్డ్ జాబ్ రోల్స్ కి జీతం పెంపు 11 శాతం, 12 శాతం మధ్య ఉంటుంది. ఇంకా, భౌగోళికంగా అహ్మదాబాద్, బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, పూణే నగరాలలో అత్యధికంగా జీతాలు చెల్లిస్తున్నారు. ఇక్కడ 12 శాతం, అంతకంటే ఎక్కువ ఇంక్రిమెంట్లు నమోదవుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
అగ్ర ఉద్యోగాలలో ఫీల్డ్ సైంటిస్ట్ (వ్యవసాయం, వ్యవసాయ రసాయనాలు), ఈవీ టెక్నాలజీ ఎక్స్పర్ట్ (ఆటోమొబైల్, అనుబంధ పరిశ్రమలు), KYC అనలిస్ట్ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా), డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ (ఈకామర్స్, టెక్ స్టార్ట్-అప్లు), కరికులం డెవలపర్ (విద్యా సేవలు), ఫుడ్ టెక్నాలజిస్ట్ (ఫాస్ట్ మూవింగ్ వినియోగ వస్తువులు), SaaSops ఇంజనీర్ (సమాచార సాంకేతికత, నాలెడ్జ్ సేవలు) ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
సేల్స్ ప్రొఫైల్స్‌కు సగటు జీతం పెరుగుదల 7.41 శాతంగా ఉంటే ఐటీ ప్రొఫైల్‌కు 9.23 శాతంగా ఉంది. నివేదికను వివరిస్తూ, టీమ్‌లీజ్ సర్వీసెస్ కో-ఫౌండర్ & ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రితుపర్ణ చక్రవర్తి మాట్లాడుతూ, “ఇంక్రిమెంట్లు ఇంకా రెండంకెల పెంపుదలకు చేరుకోనప్పటికీ, జీతాల క్షీణత, స్తబ్దత దశకు ముగింపు కనిపించడం హర్షణీయం. ఇంక్రిమెంట్లను ప్రీ-కోవిడ్ స్థాయికి త్వరలోనే చేరుకోవచ్చు" అని అన్నారు. (ప్రతీకాత్మకచిత్రం)