రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC), సెంట్రల్ రైల్వే (CR) కామన్ డిపార్ట్మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ (GDCE) ద్వారా స్టెనోగ్రాఫర్, సీనియర్ కామన్ క్లర్క్ కమ్ టికెట్ క్లర్క్ తో పాటు.. ఇతర పోస్టుల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ద్వారా 596 పోస్టులను భర్తీ చేయనున్నారు.
విభాగాల వారీగా పోస్టుల వివరాల్లోకి వెళ్తే.. స్టెనోగ్రాఫర్ 04, సీనియర్ కమ్ క్లర్క్ కమ్ టికెట్ క్లర్క్ 154, గూడ్స్ గార్డ్ 46, స్టేషన్ మాస్టర్ 75, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ 150, జూనియర్ కమ్ క్లర్క్ కమ్ టికెట్ క్లర్క్ 126, అకౌంట్స్ క్లర్క్ 37 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 596 పోస్టులను భర్తీ చేయనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
అభ్యర్థి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 50 నిమిషాల ట్రాన్స్క్రిప్షన్ సమయంతో పాటు 10 నిమిషాల వ్యవధికి నిమిషానికి 80 పదాల షార్ట్‌హ్యాండ్ వేగం కలిగి ఉండాలి. ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ లేదా దాని తత్సమానం కలిగి ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)