కోటి మందికి పైగా నిరుద్యోగులు ఎదురు చూస్తోన్న ఆర్ఆర్బీ గ్రూప్‌డీ పరీక్షలు ఫిబ్రవరి 23న ప్రారంభం కానున్నాయి. పరీక్షల షెడ్యూల్, ఎగ్జామ్ సెంటర్లు, అడ్మిట్ కార్డులకు సంబంధించిన అన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనుంది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. ఇప్పటికే దరఖాస్తులు తిరస్కరణకు గురైన అభ్యర్థుల కోసం ఎడిట్ ఆప్షన్‌ను డిసెంబర్ 15న యాక్టివేట్ చేయనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ ఎడిట్ లింకు ఆర్ఆర్బీ అన్ని రీజినల్ వెబ్సైట్లలో అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్ఆర్బీ కోరింది. కాగా, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ గ్రూప్‌డీ నోటిఫికేషన్ 2019లోనే విడుదలైంది. ఈ పరీక్ష రిజిస్ట్రేషన్ ప్రక్రియను మార్చి 12, 2019న ఆర్ఆర్బీ ప్రారంభించింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఫిబ్రవరి 23 నుంచి దేశవ్యాప్తంగా గ్రూప్ డీ పరీక్షలు ప్రారంభమవుతాయని, ఎగ్జామ్ సెంటర్‌ను చెక్ చేసుకునేందుకు త్వరలోనే లింక్ యాక్టివేట్ అవుతుందని పేర్కొంది. ఎస్టీ/ఎస్సీ అభ్యర్థులకు ఇచ్చే ట్రావెలింగ్ రీయింబర్స్‌మెంట్‌ను పరీక్షలు ప్రారంభమయ్యే 10 రోజుల ముందు ఆర్ఆర్బీ వెబ్సైట్లో అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
వీరు 2021 డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 26 వరకు.. అన్ని అధికారిక ఆర్ఆర్బీ రీజినల్ వెబ్సైట్లలో ఎడిట్ లింక్ ద్వారా తమ వివరాలను సరిచేసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలోనే అభ్యర్థులు తమ ఫోటోగ్రాఫ్‌లు లేదా సంతకాలను తిరిగి అప్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థుల వ్యాలిడిటీపై ఆర్ఆర్బీ తుది నిర్ణయం తీసుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)