3. మొత్తం 170 ఖాళీలు ఉండగా అందులో ఇంజనీర్ (సివిల్)- 50, ఇంజనీర్ (మెకానికల్)- 30, ఇంజనీర్ (ఎలక్ట్రికల్)- 90 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 నవంబర్ 26 చివరి తేదీ. రాత పరీక్ష తేదీలను రైట్స్ లిమిటెడ్ త్వరలో వెల్లడించనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. విద్యార్హతలు వివరాలు చూస్తే ఇంజనీర్ (సివిల్) పోస్టుకు సివిల్ ఇంజనీరింగ్‌లో బీఈ, బీటెక్, బీఎస్సీ పాస్ కావాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి. ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుకు ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బీఈ, బీటెక్, బీఎస్సీ పాస్ కావాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి. ఇంజనీర్ (మెకానికల్) పోస్టుకు మెకానికల్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో బీఈ, బీటెక్, బీఎస్సీ పాస్ కావాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. అభ్యర్థులకు జనరల్ ఎలక్ట్రిఫికేషన్, సైట్ సూపర్విజన్, పవర్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రికల్ మెషీన్స్ అండ్ కన్స్ట్రక్షన్, మెయింటనెన్స్ ఆఫ్ బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్ సూపర్విజన్, క్వాలిటీ అష్యూరెన్స్, ప్రొడక్షన్, మ్యాన్యుఫ్యాక్చరింగ్, మెయింటనెన్స్ అండ్ ఆపరేషన్స్‌లో రెండేళ్ల అనుభవం ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. అభ్యర్థుల వయస్సు 2020 నవంబర్ 1 నాటికి 40 ఏళ్ల లోపు ఉండాలి. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.300. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబై, నాగ్‌పూర్‌లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. ఎంపికైన వారికి సుమారు రూ.35,152 వేతనం లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)