Jobs In BOB: గుడ్ న్యూస్.. రూ. లక్షకు పైగా జీతంతో BOBలో ఉద్యోగాలు.. వివరాలిలా..
Jobs In BOB: గుడ్ న్యూస్.. రూ. లక్షకు పైగా జీతంతో BOBలో ఉద్యోగాలు.. వివరాలిలా..
Jobs In BOB: బ్యాంక్ ఆఫ్ బరోడాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 15 పోస్టులను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 15 పోస్టులను భర్తీ చేయనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జనవరి 24లోపు తమ దరఖాస్తులను సమర్పించాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అభ్యర్థుల యొక్క వయస్స 27 నుంచి 40 ఏళ్ల లోపు ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
దరఖాస్తు చేసుకునే అభ్యర్థి చార్టర్డ్ అకౌంటెంట్ లేదా ఫుల్ టైమ్ MBA లేదా PGDM లేదా తత్సమాన అర్హతను కలిగి ఉండాలి. పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 1.78 లక్షల జీతం లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
జనరల్ కేటగిరీ, EWS మరియు OBC కేటగిరీ అభ్యర్థులు 600 రూపాయల దరఖాస్తు రుసుమును చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కేటగిరీ, మహిళా కేటగిరీ అభ్యర్థులు రూ. 100 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
అభ్యర్థి దరఖాస్తు రుసుమును డెబిట్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ 04 జనవరి 2023, ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీ 24 జనవరి 2023గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
ఎలా దరఖాస్తు చేయాలి: రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క అధికారిక సైట్ను bankofbaroda.in సందర్శించి దరఖాస్తు చేసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)