1. డిగ్రీ పాస్ అయినవారికి అలర్ట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దేశవ్యాప్తంగా మొత్తం 950 అసిస్టెంట్ పోస్టుల (RBI Assistant Jobs) భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. 2022 మార్చి 8లోగా దరఖాస్తు చేయాలి. డిగ్రీ అర్హతతో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఆర్బీఐ. హైదరాబాద్‌లోని ఆర్బీఐ కార్యాలయంలో 40 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు పరీక్షా విధానం ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఆర్బీఐ అసిస్టెంట్ పోస్టులకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫీషియెన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్, హిందీ భాషల్లో రాయొచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మల్టిపుల్ ఛాయిస్‌లో ఉంటుంది. 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. సమయం 60 నిమిషాలు. (ప్రతీకాత్మక చిత్రం)
4. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయినవారికి మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ కూడా మల్టిపుల్ ఛాయిస్‌లో ఉంటుంది. 200 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. సమయం 135 నిమిషాలు. టెస్ట్ ఆఫ్ రీజనింగ్‌లో 40 ప్రశ్నలకు 40 మార్కులు ఉంటాయి. సమయం 30 నిమిషాలు. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో 40 ప్రశ్నలకు 40 మార్కులు ఉంటాయి. సమయం 30 నిమిషాలు. (ప్రతీకాత్మక చిత్రం)
5. టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీలో 40 ప్రశ్నలకు 40 మార్కులు ఉంటాయి. సమయం 30 నిమిషాలు. టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్‌నెస్‌లో 40 ప్రశ్నలకు 40 మార్కులు ఉంటాయి. సమయం 25 నిమిషాలు. టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్‌లో 40 ప్రశ్నలకు 40 మార్కులు ఉంటాయి. సమయం 20 నిమిషాలు. ప్రతీ తప్పు సమాధానానికి 1/4 మార్కు తగ్గుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఆర్బీఐ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు, దివ్యాంగులు ప్రీ-ఎగ్జామ్ ఆన్లైన్ ట్రైనింగ్‌కు దరఖాస్తు చేయొచ్చు. ప్రీ-ఎగ్జామ్ ఆన్లైన్ ట్రైనింగ్ కోసం అభ్యర్థులు సంబంధిత రీజనల్ ఆఫీస్ మెయిల్ ఐడీకి అప్లికేషన్ పంపాలి. మరిన్ని వివరాలు అధికారిక నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)