1. ఆర్ఆర్బీ ఉద్యోగాలకు అప్లై చేసినవారికి గుడ్ న్యూస్. పరీక్ష తేదీలను ప్రకటించింది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్-RRB. పెండింగ్‌లో ఉన్న నియామక పరీక్షల్ని డిసెంబర్ 15 నుంచి నిర్వహిస్తామని ఇప్పటికే ఆర్ఆర్బీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పూర్తి షెడ్యూల్‌ని మాత్రం ఇంతకాలం వెల్లడించలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఈ పోస్టులకు సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్టెనోగ్రాఫీ స్కిల్ టెస్ట్, ట్రాన్స్లేషన్ టెస్ట్, ఫర్మామెన్స్ టెస్ట్, టీచింగ్ స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఎగ్జామ్ సిటీ, తేదీ వివరాలను పరీక్షకు 10 రోజుల ముందు తెలుసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ట్రావెల్ పాస్‌ను కూడా 10 రోజుల ముందు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. పలు కారణాల వల్ల పరీక్షలు వాయిదా పడ్డాయి. మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులకు మాత్రమే కాదు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పోస్టులకు కూడా డిసెంబర్ 15 నుంచి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరగనుంది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అభ్యర్థులు అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి కొన్ని రోజులు లింక్ కూడా యాక్టీవ్‌లో ఉంచింది. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఇక రైల్వే ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులు అప్డేట్స్ కోసం http://www.rrbcdg.gov.in/ లేదా http://www.rrbsecunderabad.nic.in/ వెబ్‌సైట్స్ ఫాలో అవుతూ ఉండాలి. ఆర్ఆర్బీ జాబ్స్, రైల్వే ఉద్యోగాల విషయంలో దళారులను నమ్మి మోసపోకూడదని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్-RRB హెచ్చరిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)