Railway Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేరుగా ఇంటర్వ్యూల ద్వారానే ఎంపిక
Railway Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేరుగా ఇంటర్వ్యూల ద్వారానే ఎంపిక
కొంకణ్ రైల్వే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్(KRCL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కార్పొరేషన్ నుంచి నోటిఫికేషన్ సైతం విడుదలైంది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 10
టెక్నికల్ అసిస్టెంట్ విభాగంలో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 10
అభ్యర్థులు కొంకణ్ రైల్వేకు చెందిన అధికారిక వెబ్ సైట్ konkanrailway.com నుంచి అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకుని నింపాలి.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 10
ఆ అప్లికేషన్ ఫామ్ తో పాటు వయస్సు, విద్యార్హత, అనుభవం, కులం తదితర ధ్రుపపత్రాలను ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో వెంట తీసుకురావాల్సి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 10
విద్యార్హతల వివరాలు: Sr. Technical Assistant (Civil): అభ్యర్థులు బీఈ/బీటెక్ కోర్సులను సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో చేసి ఉండాలి. ఈ కోర్సుల్లో 60 శాతం మార్కులను సాధించి ఉండాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 10
Jr. Technical Assistant (Civil): అభ్యర్థులు బీఈ/బీటెక్ కోర్సులను 60 శాతం మార్కులతో పూర్తి చేసి ఉండాలి.(ప్రతీకాత్మక చిత్రం)