రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) 19,800 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిందని ఈ న్యూస్ సారాంశం. దీనిపై రైల్వే శాఖ స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఫేక్ అని స్పష్టం చేసింది. తాము ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని వివరించింది. ఈ మేరకు ఓ అధికారికంగా ఓ నోటీస్ జారీ చేసింది.
* అప్రమత్తత అవసరం : ‘రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)లో 19,800 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి సోషల్ మీడియా, న్యూస్ పేపర్స్‌లో ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. ఆర్పీఎఫ్ అధికారిక వెబ్‌సైట్స్‌లో లేదా ఏదైనా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదు. ఇలాంటి ఫేక్ న్యూస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.’ అంటూ కేంద్ర రైల్వేమంత్రిత్వ శాఖ నోటీస్‌లో పేర్కొంది.
కాగా ఫేక్ జాబ్ నోటిఫికేషన్స్ వెనుక పెద్ద జాబ్ రాకెట్స్ ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ముందు భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ వచ్చాయని అభ్యర్థులను నమ్మిస్తారు. అడ్డదారుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని వారి నుంచి డబ్బు వసూలు చేసి పరారవుతారు. ఢిల్లీలో ఇటీవల బటయపడ్డది ఇలాంటి స్కామ్‌లలో ఒకటని, అభ్యర్థులు ఫేక్ నోటిఫికేషన్స్‌కు స్పందించి మోసపోవద్దని అధికారులు సూచిస్తున్నారు.