రైల్వే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. గ్రూప్ సీ పోస్టుల కొరకు ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేద ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 29గా నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 21 పోస్టులను భర్తీ చేయనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వద్ద.. రెజ్యూమ్ (బయోడేటా), 10వ, 12వ మరియు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం (వెనుకబడిన తరగతి అభ్యర్థులకు), గుర్తింపు కార్డు (ఆధార్ కార్డ్, లైసెన్స్), పాస్పోర్ట్ సైజు ఫోటో దగ్గర ఉంచుకోవాలి. దరఖాస్తు ప్రారంభ తేదీ - 30 ఆగస్టు 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)