1. కొన్ని తప్పులు చేస్తే జీవితంలో రైల్వే ఉద్యోగం (Railway Jobs) సంపాదించలేరని భారతీయ రైల్వే (Indian Railways) హెచ్చరిస్తోంది. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్న అభ్యర్థులు రైల్వే ఉద్యోగం పొందకుండా జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొంటారని వార్నింగ్ ఇచ్చింది ఇండియన్ రైల్వేస్. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. కాబట్టి రైల్వే ఉద్యోగం కోరుకునేవారు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇటీవల ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలపై వివాదం నెలకొంది. దీంతో ఆర్ఆర్బీ అభ్యర్థులు ఆందోళనలకు దిగుతున్నారు. దీంతో భారతీయ రైల్వే ఈ వార్నింగ్ ఇచ్చింది. (image: Indian Railways)
3. రైల్వే ఉద్యోగాలను ఆశించేవారు రైల్వే ట్రాక్‌లపై నిరసనలు చేయడం, రైలు కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం, రైల్వే ఆస్తులను దెబ్బతీయడం లాంటి విధ్వంసాలకు, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడినట్టు తమ దృష్టికి వచ్చిందని భారతీయ రైల్వే తెలిపింది. ఇలాంటి తప్పుదారి పట్టించే కార్యకలాపాలు క్రమశిక్షణారాహిత్యం అని, అలాంటి అభ్యర్థుల్ని రైల్వే ఉద్యోగం లేదా ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులుగా పరిగణిస్తామని హెచ్చరించింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. అభ్యర్థులు అలాంటి కార్యకలాపాలకు పాల్పడ్డ వీడియోలను పరిశీలిస్తామని, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడే అభ్యర్థులతో పాటు రైల్వే ఉద్యోగాలు కోరుకుంటున్నవారిపై పోలీసు చర్యలు ఉంటాయని, దీంతో పాటు జీవితకాలంలో రైల్వే ఉద్యోగం పొందకుండా నిషేధానికి గురవుతారని భారతీయ రైల్వే హెచ్చరించింది. (ప్రతీకాత్మక చిత్రం)
5. అత్యున్నత ప్రమాణాలను కొనసాగిస్తూ రైల్వే ఉద్యోగాల నియామక ప్రక్రియ పారదర్శకంగా, న్యాయంగా నిర్వహించడానికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు కట్టుబడి ఉన్నాయని తెలిపింది. రైల్వే ఉద్యోగాలు ఆశించేవారు, ఆర్ఆర్బీ అభ్యర్థులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నవారి ప్రభావానికి లోనుకావొద్దని, తప్పుదారి పట్టొద్దని రైల్వే సూచిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) కొద్ది రోజుల క్రితం 35,281 నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) పోస్టుల భర్తీకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలు విడుదలయ్యాయి. 7,05,620 మంది అభ్యర్థులను రెండో దశ పరీక్షకు ఎంపిక చేశారు. ఈ ఫలితాలపై అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. రెండో దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కోసం అభ్యర్థులను ఎంపిక చేయడంపై అభ్యర్థుల్లో అనుమానాలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. దీంతో అభ్యర్థులు ఆందోళనలకు దిగుతున్నారు. అయితే ఈ ఫలితాలపై ఇప్పటికే భారతీయ రైల్వే క్లారిటీ ఇచ్చింది. నోటిఫికేషన్లో వివరించినట్టుగానే అభ్యర్థులను రెండో దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కోసం ఎంపిక చేసినట్టు తెలిపింది. అంతేకాదు... ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సీబీటీ 2 ఎగ్జామ్ షెడ్యూల్ కూడా విడుదల చేసింది ఆర్ఆర్బీ. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఏడో పే కమిషన్‌లోని లెవెల్ 2, 3, 4, 5, 6 లో ప్రతీ లెవెల్‌కు ఈ పరీక్ష వేరుగా ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు సంబంధిత లెవెల్ ఎగ్జామ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. అభ్యర్థుల రోల్ నెంబర్స్ సీబీటీ 1 లో ఉన్నట్టుగానే సీబీటీ 2 ఎగ్జామ్‌కు కూడా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)