రైల్వేలో వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఇటీవల వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నారు అధికారులు. తాజగా ఇండియన్ రైల్వేకు చెందిన సౌత్ ఈస్టర్న్ రైల్వే నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
మొత్తం 520 ఖాళీల్లో జనరల్ విభాగంలో 277, ఓబీసీ విభాగంలో 87, ఎస్సీ విభాగంలో 126, ఎస్టీ విభాగంలో 30 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థుల వయస్సు 42 ఏళ్లలోపు ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)