ఇటీవల రైల్వే గ్రూడ్ డీ(Railway Group D) పరీక్షలు దశల వారీగా నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ప్రాథమిక కీతో పాటు.. రెస్పాన్స్ షీట్ ను కూడా విడుదల చేశారు. అయితే ఇప్పటికే అభ్యర్థులు తమకు ఎన్ని మార్కులు వస్తాయో ఓ అంచనాకు అయితే వచ్చేశారు. అయితే ఫలితాల(Results) కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
మంచి మెరిట్ మార్కులు(Marks) సాధించిన వారు.. పీఈటీ కొరకు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. తక్కువ మార్కులు వచ్చిన వారు మాత్రం నార్మలైజేషన్ స్కోర్ కోసం ఎదురుచూస్తున్నారు. మొత్తంగా మూడేళ్ల నుంచి ఎదురు చూసిన పరీక్ష పూర్తి కాగా.. ఫలితాలను కూడా త్వరగా వెల్లడించాలని నిరుద్యోగులు(Un Employees) కోరుతున్నారు.
అయితే కొన్ని నివేదికల ప్రకారం.. RRB గ్రూప్ డి పరీక్ష యొక్క ఐదు దశల ఫలితాలను మొత్తం కలిపి ఒకే సారి విడుదల చేయనున్నట్లు సమాచారం. అభ్యర్థులు రైల్వే బోర్డు అధికారిక వెబ్సైట్ rrbcdg.gov.inలో ఈ ఐదు దశల ఫలితాలను ఏకకాలంలో తనిఖీ చేయవచ్చు. ఇక ఫలితాల తేదీ విషయానికి వస్తే.. ఈ పరీక్ష ఫలితం ఈ వారంలో ఎప్పుడైనా రావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మీరు క్లిక్ చేసిన వెంటనే RRB గ్రూప్ D రిజల్ట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. దీనిలో మీ రోల్ నంబర్ ఎంటర్ చేసి.. ఫలితాన్ని ఇక్కడ తనిఖీ చేసుకోవచ్చు. RRB గ్రూప్ డి పరీక్షలో ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. మొదటిది కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇది ఇప్పటికే నిర్వహించబడింది. (ప్రతీకాత్మక చిత్రం)
దీని తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. చివరకు మెడికల్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ మూడు దశల్లో విజయవంతంగా ఉత్తీర్ణులైన అభ్యర్థులు గ్రూప్ డి పోస్టులకు ఎంపిక చేయబడతారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి కటాఫ్ విషయానికి వస్తే.. జనరల్ కేటగిరీకి కనీస మార్కులు పేపర్లోని మొత్తం మార్కులలో 40 శాతం అని అధికారిక నోటిఫికేషన్ లో స్పష్టంగా పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
EWS వర్గానికి కూడా కనీస మార్కులు ఉంటాయి. పేపర్ మొత్తం మార్కులలో 40శాతం రావాలి. OBC వర్గానికి కనీస మార్కులు పేపర్ యొక్క మొత్తం మార్కులలో 35 శాతం ఉండాలి. SC మరియు ST వర్గాలకు కనీస మార్కులు పేపర్ మొత్తం మార్కులలో 30శాతం ఉండాలి. ఈ ఉద్యోగంలో సంపాదించే జీతం గురించి చెప్పాలంటే.. ఎంపికైన అభ్యర్థులు 7వ CPC పే మ్యాట్రిక్స్ ఆధారంగా నెలకు దాదాపు రూ.18,000 పొందుతారు. వీటితో పాటు.. అదనపు అలవెన్స్ లు కూడా ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)