పంజాబ్ రాష్ట్రం కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ (ఆర్సీఎఫ్) యాక్ట్ 550 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఏసీ అండ్ రిఫ్రిజిరేటర్ మెకానిక్ వంటి ట్రేడ్ లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు మెట్రిక్యులేషన్, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రైల్ కోచ్ ఫ్యాక్టరీ (ఆర్‌సిఎఫ్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 550 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు 04 మార్చి 2023లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)