1. భారత ప్రభుత్వానికి చెందిన పబ్లిక్ సర్వీస్ బ్రాడ్క్యాస్టర్ ప్రసార భారతి (Prasar Bharti) పలు ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. సీనియర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటీవ్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటీవ్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 9 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 జనవరి 20 చివరి తేదీ. (ప్రతీకాత్మక చిత్రం)
2. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారు డీడీ కిసాన్ ఛానల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటీవ్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులకు రెండు నోటిఫికేషన్లు వేర్వేరుగా విడుదలయ్యాయి. ఖాళీల వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. మొత్తం 9 ఖాళీలు ఉన్నాయి. వీటిలో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులు 3 ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. హిందీ తెలిసి ఉండాలి. జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన డిగ్రీ, డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. సీనియర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులు 6 ఉన్నాయి. విద్యార్హతల వివరాలు చూస్తే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. హిందీ తెలిసి ఉండాలి. జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన డిగ్రీ, డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుకు ఏదైనా టీవీ ఛానెల్, ప్రొడక్షన్ హౌజ్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో నాలుగేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. వయస్సు 35 ఏళ్ల లోపు ఉండాలి. సీనియర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుకు ఏదైనా టీవీ ఛానెల్, ప్రొడక్షన్ హౌజ్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆరేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. వయస్సు 50 ఏళ్ల లోపు ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. https://applications.prasarbharati.org/ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజీలో Register Yourself పైన క్లిక్ చేసి అభ్యర్థి తన వివరాలతో రిజిస్టర్ చేయాలి. ఆ తర్వాత లాగిన్ చేసి దరఖాస్తు చేయాలనుకున్న పోస్ట్ సెలెక్ట్ చేయాలి. విద్యార్హతలు, అనుభవం, ఇతర వివరాలతో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసి భద్రపర్చుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)