1. తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు శుభవార్త. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-PGCIL ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈసారి తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 67 ఖాళీలను ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇప్పటికే సదరన్ రీజియన్‌లో కర్నాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చెరీలో 119 ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలను భర్తీ చేస్తోంది. అసిస్టెంట్, ఎగ్జిక్యూటీవ్, గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-PGCIL. (ప్రతీకాత్మక చిత్రం)
4. మొత్తం 67 ఖాళీలు ఉండగా అందులో అసిస్టెంట్ (హ్యూమన్ రీసోర్స్)- 4, ఎగ్జిక్యూటీవ్ (హ్యూమన్ రీసోర్స్)- 3, గ్రాడ్యుయేట్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్- 5, గ్రాడ్యుయేట్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 8, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్- 5, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 26, ఐటీఐ ఎలక్ట్రికల్- 16 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)