1. పోస్ట్ ఆఫీసులో ఉద్యోగాల (Post Office Jobs) భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. గ్రూప్ సీ పోస్టుల భర్తీకి ఇండియా పోస్ట్ (India Post) నోటిఫికేషన్ విడుదల చేసింది. స్కిల్డ్ ఆర్టిసన్ పోస్టులున్నాయి. మొత్తం 5 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2022 అక్టోబర్ 19 చివరి తేదీ. కాంపిటీటీవ్ ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. చెన్నైలోని మెయిల్ మోటార్ సర్వీస్‌లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఇండియా పోస్ట్. అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో అప్లై చేయాలి. అంటే అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి, పూర్తి చేసి, నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్‌కు పోస్టులో పంపాలి. ఒకటి కన్నా ఎక్కువ పోస్టుకు అప్లై చేస్తే దరఖాస్తు ఫామ్ తిరస్కరిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 8వ తరగతి పాస్ కావాలి. టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ నుంచి సంబంధిత ట్రేడ్‌లో సర్టిఫికెట్ పొంది ఉండాలి. ఎంవీ మెకానిక్ పోస్టుకు అప్లై చేసేవారికి హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అభ్యర్థుల వయస్సు 2021 జూలై 1 నాటికి 18 ఏళ్లలోపు ఉండాలి. గరిష్ట వయస్సు 30 ఏళ్లు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఈ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థులు ముందుగా https://www.indiapost.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. రిక్రూట్మెంట్స్ సెక్షన్లో Skilled Artisans నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి. నోటిఫికేషన్లోనే దరఖాస్తు ఫామ్ ఉంటుంది. ప్రింట్ తీసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)