1. పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు కోరుకునే నిరుద్యోగులకు శుభవార్త. పోస్ట్ ఆఫీసుల్లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. పశ్చిమ బెంగాల్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఖాళీగా ఉన్న పోస్టల్ అసిస్టెంట్ (PA), సార్టింగ్ అసిస్టెంట్ (SA), పోస్ట్‌మ్యాన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. పోస్ట్ ఆఫీసులు, సేవింగ్స్ బ్యాంక్ కంట్రోల్ ఆర్గనైజేషన్, సర్కిల్ ఆఫీస్, రీజనల్ ఆఫీస్, రైల్వే మెయిల్ సర్వీస్‌లో ఈ పోస్టులున్నాయి. మొత్తం 124 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 24 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ పద్ధతిలో అంటే పోస్టులో దరఖాస్తుల్ని పంపాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. మొత్తం 124 ఖాళీలు ఉండగా అందులో పోస్టల్ అసిస్టెంట్ పోస్టులు 51, సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులు 25, పోస్ట్‌మ్యాన్ పోస్టులు 48 ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డ్ నుంచి ఇంటర్మీడియట్ పాస్ కావాలి. 60 రోజుల బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. క్రీడార్హతల విషయానికి వస్తే రాష్ట్రం తరఫున లేదా దేశం తరఫున జాతీయ, అంతర్జాతీయ క్రీడలు, గేమ్స్‌లో పాల్గొని ఉండాలి. ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్‌లో పాల్గొనాలి. నేషనల్ స్పోర్ట్స్‌లో స్టేట్ స్కూల్ టీమ్స్ నుంచి పార్టిసిపేట్ చేయాలి. అభ్యర్థులు ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్ https://www.indiapost.gov.in/ లో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్‌కు 2021 డిసెంబర్ 24 లోగా చేరేలా పోస్టులో పంపాలి. దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
The Assistant Director (Recruitment), Office of the Chief Postmaster General, West Bengal Circle, P-36, CR Avenue, Yogayog, Bhawan, Kolakata - 700012. (ప్రతీకాత్మక చిత్రం)