కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, ఉద్యోగాలు సాధించిన 71వేల మందికి వర్చువల్ విధానంలో నియామక పత్రాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ రోజ్‌గార్ మేళా (ఉపాధి మేళా)లో భాగంగా మంగళవారం దాదాపు 71 వేల అపాయింట్మెంట్ లెటర్లను ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంపిణీ చేశారు. ఈ లెటర్ల ఫిజికల్ కాపీలను దేశ వ్యాప్తంగా ఉన్న 45 లొకేషన్ల ద్వారా అభ్యర్థులకు గతంలోనే అందజేశారు.
గుజరాత్లో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లోనూ మొన్నటి వరకు ఎన్నికల కోడ్ ఉంది. దీంతో ఈ రెండు రాష్ట్రాలు మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలలోనూ ఈ నియామక లేఖల ఫిజికల్ కాపీలు అందరికీ ఇప్పటికే చేరుకున్నాయి. గత అక్టోబర్‌లోనూ 75 వేల మందికి నియామక పత్రాలు అందజేసినట్లు సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. వచ్చే ఏడాదిన్నర కాలంలో 10 లక్షల మందిని ‘మిషన్ మోడ్’లో నియమించాలని వివిధ ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖలను మోదీ జూన్‌లో కోరారు. (ప్రతీకాత్మక చిత్రం)
నిరుద్యోగులకు మంచి అవకాశాలను కల్పించడం ద్వారా వారి సాధికారత సాధ్యం అవుతుందని, దీని వల్ల వారు భారత దేశ అభివృద్ధిలో నేరుగా భాగస్వాములు అవుతారని పీఎంవో ప్రకటన వెల్లడించింది. నిరుద్యోగులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనే నిబద్ధతతో పని చేస్తున్నామని, ఎక్కువ ఉద్యోగాలు సృష్టించడం తమ హైయస్ట్ ప్రయారిటీ అని స్పష్టం చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
* కర్మయోగి ప్రారంభ్ కోర్సు ప్రారంభం
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘కర్మయోగి ప్రారంభ్ మాడ్యూల్’ను కూడా ప్రారంభించారు. ఈ మాడ్యూల్ ఓ ఆన్లైన్ ఓరియంటేషన్ కోర్సు. కొత్తగా వివిధ ప్రభుత్వ శాఖల్లో నియమితులైన వారందరూ ఈ ఓరియంటేషన్ కోర్సును చేయాల్సి ఉంటుంది . (ప్రతీకాత్మక చిత్రం)
ఇది ప్రభుత్వోద్యోగులకు ప్రవర్తనా నియమావళి, వర్క్ ఎథిక్స్, హ్యూమన్ రిసోర్స్ పాలసీలు, ఇతర ప్రయోజనాలు, అలవెన్సులు లాంటి వాటి అన్నింటిపైనా అవగాహన కలిగిస్తుంది. ప్రభుత్వ విధానాలకు అలవాటు పడటానికి, కొత్త ఉద్యోగాలలో తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడానికి ఈ కోర్సు వారికి ఎంతగానో ఉపయోగపడనుంది. (ప్రతీకాత్మక చిత్రం)