కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా వర్క్ ఫ్రమ్ హోమ్‌కు(Work from Home) పాపులారిటీ బాగా పెరిగింది. ఇంటి నుంచే పని చేయడాన్ని చాలా మంది ఉద్యోగులు ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా ఐటీ రంగంలో(IT Sector) ఈ తరహా విధానానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఈ కారణంగానే శాశ్వతంగానే ఇంటి వద్ద నుంచే పని చేసే(Permanent WFH) అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
www.naukari.com ప్రకారం అమెజాన్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్, పీడబ్ల్యూసీ, ట్రైజెంట్, ఫ్లిప్‌కార్ట్, సైమెన్స్, డెలాయిట్, ఒరాకిల్, జెన్సార్ టెక్నాలజీస్, టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్, క్యాప్జెస్ లాంటి సంస్థలు శాశ్వతంగా ఇంటి వద్ద నుంచే పనిచేసే అవకాశాలుండే ఉద్యోగాలను పోస్ట్ చేస్తున్నాయి.
(ప్రతీకాత్మక చిత్రం)
ప్రపంచవ్యాప్తంగా స్లాక్, ట్విట్టర్, స్పాటిఫై, టాటా స్టీల్ లాంటి కంపెనీలు కూడా వర్క్‌ఫ్రమ్ హోంగా పనిచేసే అవకాశాన్ని ఉద్యోగులకు ఇస్తున్నాయి. డేటా సైంటిస్ట్, సాఫ్ట్వేర్ డెవలపర్, డిజైనర్లు, ప్రొడక్ట్ డిజైనర్లు, టెక్నికల్ రైటర్లు, ప్రోగ్రామర్లు, రిక్రూటర్లు ఇతర వ్యక్తిగత కంట్రిబ్యూటర్లు లాంటి జాబ్స్‌లో శాశ్వత ప్రాతిపదికన పనిచేసే అవకాశం ఉందని టీమ్ లీజ్ డేటా చూపించింది. (ప్రతీకాత్మక చిత్రం)
వర్క్ ఫ్రమ్ హోమ్‌తో పెరిగిన ఉత్పాదకత..
వర్క్ ఫ్రమ్ హోమ్(WFH) ఏర్పాటు తో ఉత్పాదకత పెరిగిందని కూడా ఈ డేటా సూచించింది. రిమోట్, ఫ్లెక్సిబుల్ వర్కర్లు ఇంటి నుంచి పనిచేస్తున్నప్పుడు తక్కువ ఒత్తిడి స్థాయిల కారణంగా సంతోషంగా, విశ్వసనీయంగా ఉన్నారని ఫ్లెక్స్ జాబ్స్ నివేదిక పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
వర్క్ ఫ్రమ్ హోం వల్ల మౌలిక సదుపాయాల ఖర్చు, ఉద్యోగుల నిలుపుదల, విస్తృతమైన ప్రతిభను పొందడం, ఉద్యోగులకు డిస్ట్రాక్షన్ లేకపోవడం లాంటి విషయాల్లో ఖర్చు ఆదా అయిందని టీమ్ లీజ్ బిజినెస్ హెడ్ శివప్రసాద్ నండూరి అన్నారు.వర్క్ ఫ్రమ్ హోమ్‌కు జనాదరణ పెరుగుతున్న కారణంగా టెక్ మహీంద్రా అవసరమైన నైపుణ్యాల సెట్లను కలిగి ఉన్న వర్కర్ల కోసం చూస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇది యజమానులు ఫ్రీలాన్స్ వర్క్‌ఫోర్స్‌లోకి సజావుగా ట్యాప్ చేయడానికి అవసరమైన ప్రతిభను పొందేందుకు వీలు కల్పిస్తుంది" అని టెక్ మహీంద్రా మార్కెటింగ్ ప్రతినిధి హర్షవేంద్ర సోయిన్ అన్నారు.జెన్సార్ టెక్నాలజీస్ సంస్థ కరోనా ప్రారంభ దశలో వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని ఉద్యోగులకు కల్పించింది. (ప్రతీకాత్మక చిత్రం)
అలాగే శారీరక వైకల్యం ఉన్నవారితో పాటు ఇది మా ఉద్యోగులకు మెరుగైన పని జీవితాన్ని ఏకీకృతం చేయడానికి దారితీసింది" జెన్సార్ హెచ్ఆర్ వివేక్ రంజన్ స్పష్టం చేశారు.భౌగోళిక అవరోధాలు లేకుండా ప్రతిభను వెలికితీసే అవకాశాన్ని రిమోట్ వర్క్ కల్చర్ అందిస్తుందని హెచ్ఆర్ నిపుణులు విశ్వసిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)