1. నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. కేంద్ర ప్రభుత్వ కొలువు కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు త్వరలో వివిధ ఉద్యోగ నోటిఫికేషన్లు ఆశించవచ్చు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో భారీగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అవసరాల మేరకు.. సమయానుకూలంగా ఆయా శాఖలు రిక్రూట్మెంట్ చేపట్టున్నాయి. ఈ విషయాన్ని ఓ ప్రశ్నకు రాతపూర్వక సమాధానంగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభకు తెలియజేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల్లో దాదాపు 9.79 లక్షల ఖాళీలు ఉన్నట్లు బుధవారం లోక్‌సభకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తెలియజేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ పే రీసెర్చ్ యూనిట్ వార్షిక నివేదిక ప్రకారం.. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల పరిధిలో 9.79 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నట్లు జితేంద్ర సింగ్ రాతపూర్వకంగా తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
3. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లోని ఖాళీలను అవసరాల మేరకు.. సమయానుకూలంగా భర్తీ చేయాలని ఆదేశించామని పేర్కొన్నారు. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు. ఈ విషయంపై ఆయా విభాగాలకు స్పష్టమైన సమాచారం ఉందని వివరించారు. భారతదేశ అభివృద్ధిలో ప్రత్యక్షంగా భాగమయ్యేలా, తమ సాధికారత కోసం ప్రయత్నించే యువత కోసం భారత ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న రోజ్ గారి మేళాలు ఉద్యోగ కల్పనలో మరింత సహకారం అందిస్తాయని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
4. దేశంలో అత్యున్నత ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(IAS)లో 1,472 ఖాళీలు ఉన్నట్లు మరో ప్రశ్నకు సమాధానంగా జింతేద్ర సింగ్ చెప్పారు. 2022 సివిల్ లిస్ట్ ప్రకారం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో రాష్ట్రాల వారీగా 6,789 ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగించామని, 5,317 మంది సర్వీస్‌లో ఉన్నారని వివరించారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. డైరెక్ట్లీ రిక్రూటెడ్ (DR) ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారులను సరైన రీతిలో తీసుకోవడం కోసం బస్వాన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తున్నట్లు జితేంద్ర సింగ్ చెప్పారు. CSE-2012 నుంచి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా 180 మందిని రిక్రూట్ చేస్తున్నట్లు వివరించారు. 180 కంటే ఎక్కువ మందిని తీసుకుంటే అభ్యర్థుల నాణ్యత విషయంలో రాజీ పడాల్సి వస్తుందని కమిటీ సిఫార్సు చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)