ఇదిలా ఉంటే.. తాజాగా అమెరికా కాలిఫోర్నియాలోని యూగో అనే నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్.. ఉమెన్ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. గివ్ ఇండియా సంస్థ సహకారంతో ఈ స్కాలర్షిప్ను అందిస్తోంది. ఈ స్కాలర్షిప్కు అర్హత, ప్రయోజనాలు, కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటి? దరఖాస్తు ఎలా చేసుకోవాలో చూద్దాం.
అర్హులు ఎవరు? : టీచింగ్, నర్సింగ్, ఫార్మసీ, మెడిసిన్, ఇంజనీరింగ్ మొదలైన ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అభ్యసిస్తున్న యువతులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. దరఖాస్తుదారులు వారి గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ మొదటి సంవత్సరం చదువుతూ ఉండాలి. 10, 12వ తరగతి పరీక్షలలో కనీసం 70 శాతం మార్కులు సాధించి ఉండాలి. వారి వార్షిక కుటుంబ ఆదాయం తప్పనిసరిగా రూ.5 లక్షల కంటే తక్కువగా ఉండాలి.
యూగో స్కాలర్షిప్ బెనిఫిట్స్ : ఈ ప్రతిష్టాత్మక స్కాలర్షిప్ ద్వారా టీచింగ్ కోర్సులకు, 2 సంవత్సరాలకు గాను సంవత్సరానికి రూ.40,000 స్కాలర్షిప్ అందుకోవచ్చు. నర్సింగ్, ఫార్మా కోర్సులకు 4 సంవత్సరాలకు గాను సంవత్సరానికి రూ.40,000, ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులకు 4 సంవత్సరాలకు గాను సంవత్సరానికి రూ.60,000 లభిస్తుంది.
అవసరమైన డాక్యుమెంట్స్ : ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవడానికి ఇంటర్మీడియట్ మార్క్ షీట్, ప్రభుత్వం జారీ చేసిన ఐడెంటిటీ కార్డు (ఆధార్ కార్డ్/ఓటర్ ఐడీ కార్డ్/డ్రైవింగ్ లైసెన్స్/పాన్ కార్డ్) సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత సంవత్సరం ప్రవేశ రుజువు (ఫీజు రసీదు/అడ్మిషన్ లెటర్/సంస్థ గుర్తింపు కార్డు/బోనఫైడ్ సర్టిఫికెట్), కుటుంబ ఆదాయ రుజువు (ITR ఫారం-16/ఇన్కమ్ సర్టిఫికెట్/ తల్లిదండ్రుల పే స్లిప్పులు) అందజేయాలి. అదే విదంగా ఫీజు పేమెంట్ స్లిప్స్ (కాలేజీలో కట్టిన ఫీజు రిసిప్ట్‌లను అప్లోడ్ చేయాలి), బ్యాంక్ అకౌంట్ వివరాలు, విద్యార్థిని ఫోటో కూడా అవసరం అవుతాయి.
ఎలా దరఖాస్తు చేయాలి? : ముందుగా సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఆ తర్వాత స్కాలర్షిప్కు సంబంధించిన వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. వివరాలను పూర్తిగా చదివిన తర్వాత నెక్ట్స్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత దరఖాస్తు ఫారమ్ స్క్రీన్‌పై ఓపెన్ అవుతుంది. కావాల్సిన వివరాలను అందించి దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేయాలి. భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తును ప్రింట్ తీసుకోవాలి.