కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో గతంలో వాయిదా పడిన అనేక పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
తాజాగా తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీ పీజీ, యూజీ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
జులై 19 నుంచి ఆయా పరీక్షలను నిర్వహించనున్నట్లు యూనివర్సీటీ అధికారులు వెల్లడించారు. అందుకు సంబంధించిన తేదీల వివరాలు ఇలా ఉన్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
జులై 19వ తేదీ నుంచి ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకామ్, ఎంఎల్ఐఎస్సీ తదితర పీజీ కోర్సుల నాలుగో సెమిస్టర్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
జులై 14, 16 తేదీల్లో గతంలో వాయిదా పడిన పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
గతంలో కరోనా కారణంగా వాయిదా పడిన డిగ్రీ మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షలను జులై 8 నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను యూనివర్సిటీ అధికారిక వెబ్ సైట్ https://www.osmania.ac.in/ లో చూడొచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)