* ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ : ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) తూర్పు ప్రాంతంలోని వివిధ ఎయిర్ పోర్ట్‌లలో సీనియర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్లో అక్టోబర్ 12 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 10న ముగుస్తుంది. ఈ పోస్టులకు పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, అండమాన్ & నికోబార్ దీవులు, సిక్కింలో నివసిస్తున్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులకు రూ.1,10,000 వరకు జీతం లభిస్తుంది.
* సదరన్ రైల్వే రిక్రూట్మెంట్ : రాత పరీక్ష లేకుండానే గవర్నమెంట్ ఉద్యోగం పొందే అవకాశం కల్పించింది సదరన్ రైల్వే. వివిధ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 31లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా 1343 పోస్టులను భర్తీ చేయనుంది.10వ తరగతి, 12వ తరగతి లేదా ITI కోర్సుల్లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయనున్నారు.
* సీడ్యాక్ ప్రాజెక్టు ఇంజనీర్ : కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీ డ్యాక్ (సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్) సంస్థ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 20లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తంగా 250 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు వార్షిక వేతనం రూ.14 లక్షల వరకు ఉంటుంది.
* జొమాటో కస్టమర్ సపోర్ట్ : ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో చాట్ ప్రాసెస్‌లో కస్టమర్ సపోర్ట్ పోస్ట్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు రూ. 2,94,000 వార్షిక వేతనం లభిస్తుంది. అభ్యర్థులు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేయాల్సి ఉంటుంది.
* ఎస్ఎస్బీ కానిస్టేబుల్ : కేంద్ర సాయుధ దళాల్లో ఒకటైన సశస్త్ర సీమా బల్ (SSB) కానిస్టేబుల్ పోస్టులను స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయడానికి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్సైట్ ssbrectt.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 399 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు నేపాల్, భూటాన్ సరిహద్దుల్లో పనిచేయాల్సి ఉంటుంది. వీరికి నెలకు రూ. రూ.69,100 వరకు జీతం లభిస్తుంది.