1. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్-NTPC లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 70 ఖాళీలు ఉన్నాయి. జార్ఖండ్, ఒడిశా, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని ఎన్టీపీసీ ప్రాజెక్టుల్లో మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్ లాంటి విభాగాల్లో ఈ పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. మొదటి దశ ఆన్లైన్ టెస్టుకు అడ్మిట్ కార్డుల డౌన్లోడ్ 2020 డిసెంబర్ చివరి వారంలో ప్రారంభమవుతుంది. మొదటి దశ ఆన్లైన్ టెస్టు 2021 జనవరి మొదటి వారంలో ఉంటుంది. రెండో దశ ఆన్లైన్ టెస్టుకు అడ్మిట్ కార్డుల డౌన్లోడ్ 2021 జనవరి చివరి వారంలో మొదలవుతుంది. రెండో దశ ఆన్లైన్ టెస్టు 2021 ఫిబ్రవరి మొదటి వారంలో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. విద్యార్హతల వివరాలు చూస్తే మైనింగ్ పోస్టుకు డిప్లొమా ఇన్ మైనింగ్ లేదా మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ పోస్టుకు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ పోస్టుకు డిప్లొమా ఇన్ మెకానికల్ లేదా ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మైన్ సర్వే పోస్టుకు డిప్లొమా ఇన్ మైన్ సర్వే లేదా డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ లేదా డిప్లొమా ఇన్ మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్ పాస్ కావాలి. ఈ కోర్సులను 70 శాతం మార్కులతో పాస్ కావాలి. ఫుల్ టైమ్ కోర్స్ పూర్తి చేసినవారే అప్లై చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)