మాథ్స్ కు సంబంధించి ప్రపోర్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్ టాపిక్ ను పూర్తిగా తొలగించారు. ఇంకా రిలేషన్స్, సెట్స్, స్టాటిస్టిక్స్, త్రీ డైమెన్షన్, జామెట్రీలో లైన్స్ అండ్ ప్లేన్స్ పై కొంత సిలబస్ ను అదనంగా చేర్చారు. ఇంకా ఫిజిక్స్ కు సంబంధించి యంగ్స్ మాడ్యూల్స్ బై సియర్లస్ మెథడ్ ను తొలగించారు.(ప్రతీకాత్మక చిత్రం)
ఇదిలా ఉంటే.. 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ JEE(Mains)ను రెండు సెషన్స్‌లో నిర్వహించనున్నారు. మొదటి సెషన్ పరీక్షలు 2023 జనవరి 24 నుంచి జనవరి 31 వరకు నిర్వహిస్తారు. ఈ సెషన్‌కి సంబంధించి డిసెంబర్ 15 నుంచి జనవరి 12 వరకు రిజిస్టర్ చేసుకోవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా
JEE(mains) అప్లికేషన్ ప్రాసెస్ కేవలం ఆన్లైన్లోనే ఉంటుంది. ఈ ఎగ్జామ్‌ని 13 ఇండియన్ లాంగ్వేజెస్‌లో నిర్వహించనున్నారు. ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, పంజాబీ, గుజరాతి, ఒడియా, ఉర్దూలో విద్యార్థులు పరీక్ష రాయవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)