1. భారతీయ రైల్వే మాత్రమే కాదు... రైల్వేకు చెందిన పలు సంస్థలు కూడా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తుంటాయి. నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్స్టిట్యూట్-NRTI పలు ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. ఇది కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఈ విద్యా సంస్థలో నాన్-టీచింగ్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 ఆగస్ట్ 8 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.nrti.edu.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఇదే వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. కాంట్రాక్ట్ గడువు మూడేళ్లు ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. భర్తీ చేసే పోస్టుల వివరాలు చూస్తే చీఫ్ అడ్మిషన్ అండ్ ఔట్రీచ్ ఆఫీసర్, డైరెక్టర్ (ఎగ్జిక్యూటీవ్ ఎడ్యుకేషన్), డైరెక్టర్ (స్కిల్ డెవలప్మెంట్), చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, హ్యూమన్ రీసోర్స్ ఆఫీసర్, స్టూడెంట్స్ యాక్టివిటీస్ ఆఫీసర్, కమ్యూనికేషన్ ఆఫీసర్, డిప్యూటీ వార్డెన్, అడ్మిన్ అసిస్టెంట్, ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ లేదా యోగా ట్రైనర్, ల్యాబరేటరీ అసిస్టెంట్, ల్యాబరేటరీ టెక్నీషియన్ పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)