1. రైల్వేలో ఉద్యోగం మీ కలా? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకుంటున్నారా? ప్రభుత్వ బ్యాంకులో జాబ్ పొందాలనుకుంటున్నారా? ఈ ఉద్యోగాలకు మీరు వేర్వేరుగా పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. ఒకే పరీక్ష రాస్తే చాలు. అంటే వేర్వేరు పరీక్షలకు ఫీజు వేర్వేరుగా చెల్లించి, ఎగ్జామ్స్ ఒక్కొక్కటిగా రాయాల్సిన పరిస్థితి ఉండదు. త్వరలోనే ఈ ఉద్యోగాలన్నింటికీ ఒకే పరీక్ష ఉండబోతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. రైల్వేలో ఖాళీల భర్తీ కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్-RRB, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్-IBPS, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయి. అభ్యర్థులు ఈ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసి పరీక్షలకు హాజరవుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4. కానీ ఇకపై ఈ పరిస్థితి ఉండదు. ఆర్ఆర్బీ, ఐబీపీఎస్, ఎస్ఎస్సీ నిర్వహించే నియామకాలకు ఒకే దరఖాస్తు చేస్తే చాలు. పరీక్ష కూడా ఒకటే ఉంటుంది. కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ను నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ-NRA నిర్వహిస్తుంది. అంటే ఆర్ఆర్బీ, ఐబీపీఎస్, ఎస్ఎస్సీ నిర్వహించే ఎగ్జామ్స్ ఇకపై ఉండవు. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ-NRA నిర్వహించే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్-CET మాత్రమే ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. కేంద్ర ప్రభుత్వంలో, ప్రభుత్వ రంగ సంస్థలో నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీ కోసం మాత్రమే నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ సెట్ నిర్వహిస్తుంది. అది కూడా ఆర్ఆర్బీ, ఐబీపీఎస్, ఎస్ఎస్సీ నియామకాల కోసం ఇది మొదటి దశ పరీక్ష మాత్రమే. మొదటి దశ క్వాలిఫై అయినవారికి ఆయా సంస్థలు వేర్వేరుగా ఇతర దశల పరీక్షల్ని, ఇంటర్వ్యూలను నిర్వహిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ-NRA దేశవ్యాప్తంగా 1000 కేంద్రాల్లో కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్-CET నిర్వహిస్తుంది. అభ్యర్థులు కామన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేయాలి. గ్రామీణ ప్రాంత అభ్యర్థులు తమకు సమీపంలో ఉన్న ఎగ్జామ్ సెంటర్ ఎంచుకోవచ్చు. ఎగ్జామ్ ఆన్లైన్లో ఉంటుంది. అభ్యర్థులు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
8. ప్రతీ ఏటా రెండుసార్లు ఈ ఎగ్జామ్ ఉంటుంది. ఇంటర్ పాస్ అయినవారికి, డిగ్రీ పాస్ అయినవారికి సెట్ సిలబస్ వేర్వేరుగా ఉంటుంది. అభ్యర్థులు ఈ రెండు పరీక్షల్ని రాయొచ్చు. ఇంగ్లీష్, హిందీతో పాటు 12 భారతీయ భాషల్లో పరీక్ష రాయొచ్చు. అంటే తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు తెలుగులోనే పరీక్ష రాయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
9. ఇందుకోసం ప్రశ్నాపత్రాన్ని ట్రాన్స్‌లేట్ చేసేందుకు లాంగ్వేజ్ ఎక్స్‌పర్ట్స్‌ని నియమించుకోనుంది NRA. సెట్లో సాధించిన స్కోర్‌కు మూడేళ్ల వేలిడిటీ ఉంటుంది. ఒక అభ్యర్థి ఎన్నిసార్లైనా పరీక్ష రాయొచ్చు. ఈ స్కోర్ ద్వారా ఆర్ఆర్బీ, ఐబీపీఎస్, ఎస్ఎస్సీ ఉద్యోగాల భర్తీకి రెండో దశ పరీక్ష కోసం అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)