తర్వాత గ్రూప్ 1 కు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. తర్వాత టీఎస్పీఎస్సీ నుంచి స్పెషల్ అర్హతతో కూడిన ఉద్యోగాల భర్తీకి 5 నుంచి 6 నోటిఫికేషన్స్ కూడా వచ్చాయి. అయినా నిరుద్యోగుల్లో అసంతృప్తి తొలగలేదు. జనరల్ డిగ్రీతో కూడిన ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లకు రాకపోవడంతో నిరాశ చెందుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
అయితే మధ్యలో మునుగోడు బై ఎలక్షన్స్ రావడంతో కొత్త నోటిఫికేషన్లకు బ్రేక్ పడింది. దీంతో పాటు.. రాష్ట్రంలో గిరిజనుల రిజర్వేషన్ కు సంబంధించి 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో మళ్లీ.. రోస్టర్ విధానం మార్చాల్సి వచ్చింది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అడ్డంకి రావడంతో.. నోటిఫికేషన్ల జారీకి ఆలస్యం అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
తాజాగా ఎస్టీ రోస్టర్ విధానం పూర్తి అయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అంతే కాకుండా.. సుప్రీం కోర్టు నుంచి అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ సబబే అంటూ తీర్పు రావడంతో.. రిజర్వేషన్ల విషయంలో ఇబ్బందులు తొలగినట్లే. దీనిలో భాగంగానే టీఎస్పీఎస్సీకి ప్రభుత్వం నోటిఫికేషన్లను వెను వెంటనే విడుదల చేయాలని ఆదేశించినట్లు సమాచారం. (ప్రతీకాత్మక చిత్రం)
కొత్త రోస్టర్ ప్రకారం ప్రస్తుతం నోటిఫికేషన్లు రానున్నాయి. అయితే ఇటీవల గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి ఆర్థిక శాఖ నుంచి ఇటీవల అనుమతి వచ్చింది. నవంబర్ చివరి నాటికి ఈ పోస్టులకు సంబంధించి రోస్టర్ విధానం పూర్తి చేసి.. డిసెంబర్ లో గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులకు నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
దీంతో పాటు.. ఇప్పటికే 9 వేలకు పైగా గురుకుల పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభించింది. ఎస్టీ రిజర్వేషన్ కారణంగా నోటిఫికేషన్ ఆలస్యం అవుతూ వస్తోంది. నవంబర్ చివరి వారం వరకు రోస్టర్ల ప్రకారం ఖాళీల వివరాలను రిక్రూట్ మెంట్ బోర్డుకు సమర్పించనున్నట్లు గురుకుల సంస్థలు పేర్కొన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)