Telangana Government Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ శాఖలో 700 పోస్టులు భర్తీ.. వివరాలివే..
Telangana Government Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ శాఖలో 700 పోస్టులు భర్తీ.. వివరాలివే..
Telangana Government Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. సీఎం ప్రకటించిన 50 వేల ఉద్యోగాల భర్తీలో భాగంగా ఇరిగేషన్ శాఖలో ఉన్న 700 పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. నేడో, రేపో ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వివరాలిలా ఉన్నాయి.
తెలంగాణలోని సాగునీటి శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా అధికారులు చర్యలు మొదలుపెట్టారు. తొలి విడతలో 700 పోస్టులు భర్తీ చేసేందుకు ఆ శాఖ అధికారులు సిద్ధమయ్యారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
వాటిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు 568, అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు 132 ఉండనున్నాయి. వీటి భర్తీకి సంబంధించిన ఫైలు ఇప్పటికే ప్రభుత్వానికి చేరగా, త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది. (సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)
3/ 6
సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఇప్పటికే శాఖ పునర్వ్యవస్థీకరణ చేసి కొత్త డివిజన్లు ఏర్పాటు చేశారు. అందుకు అనుగుణంగా ఇంజనీర్ ఇన్ చీఫ్ స్థాయి నుంచి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి వరకు 378 పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
ఈ పదోన్నతులతో పాటు ఖాళీగా ఉన్న ఇతర పోస్టులు కలిపి మొత్తంగా శాఖ పరిధిలో 1,167 ఖాళీలున్నట్లు ఇరిగేషన్ శాఖ గుర్తించింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
ఇందులో తొలి విడతలో భాగంగా 700 పోస్టులు భర్తీ చేసేందుకు నిర్ణయించారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
భర్తీ చేయనున్న ఏఈఈ పోస్టుల్లో సివిల్‌కు సంబంధించి 310, మెకానికల్ 58, ఎలక్ట్రికల్ 200 ఉండనున్నాయి. వీటికి సంబంధించి అర్హతలు త్వరలోనే ప్రకటించనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)