ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ కేంద్రాల్లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 12, 2022గా పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ కేంద్రాల్లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 12, 2022గా పేర్కొన్నారు. సెప్టెంబర్ 5 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 560 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (గ్రేడ్ -2) పోస్టులను భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్ 15 నుంచి 17 వరకు హాల్టికెట్లు జారీ చేయనున్నారు. తర్వాత సెప్టెంబర్ 18న రాత పరీక్ష నిర్వహించనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే అర్హులైన కాంట్రాక్ట్ వర్కర్లు, సూపర్వైజర్లతో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను జోన్ల వారీగా భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు అర్హత మినిమమ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
అభ్యర్థుల యొక్క కనీస వయో పరిమితి 21 సంవత్సరాలు, గరిష్ట వయో పరిమితి 35 సంవత్సరాలు ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. జోన్ల వారీగా ఖాళీల వివరాలు ఇవే.. కర్నూలు జోన్ - 216, ఏలూరు జోన్ - 142, ఒంగోలు జోన్ - 126, విశాఖ జోన్ - 76. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
ఈ నాలుగుజోన్ల పరిధిలో కేటాయించే కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను https://wdcw.ap.gov.in/ వెబ్సైట్లో చూడొచ్చు. పరీక్ష సిలబస్ విషయానికి వస్తే.. మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలను ఇస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)