దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో ఒకటైన నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT) ఇటీవల వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. తాజాగా NIT Jamshedpurలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం 73 నాన్ టీచింగ్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ.1.44 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రిన్సిపల్ సైంటిఫిక్/టెక్నికల్ ఆఫీసర్, సూపరింటెండింగ్ ఇంజనీర్, డిప్యూటీ లైబ్రేరియన్, మెడికల్ ఆఫీసర్, సూపరింటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్, టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ తదితర ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
విద్యార్హతల వివరాలు.. Principal scientific or technical officer: ఈ విభాగంలో ఒక ఖాళీని భర్తీ చేయనున్నారు. BE, BTech లేదా సంబంధిత విభాగంలో M.Sc చేసిన వారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. Superintending engineer: ఈ విభాగంలో ఒక ఖాళీని భర్తీ చేయనున్నారు. సివిల్ ఇంజనీరింగ్ లో బీఈ/బీటెక్ చేసి 20 ఏళ్ల అనుభవం ఉన్న వారు దరఖాస్తుకు అర్హులు.(ప్రతీకాత్మక చిత్రం)
Technical assistant: ఈ విభాగంలో మొత్తం 22 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఫస్ట్ క్లాస్ మార్కులతో బ్యాచలర్ డిగ్రీ, డిప్లొమో లేదా సివిల్, Metallurgy, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్, మెకానికల్, ప్రొడక్షన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా మాథ్స్ సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు.(ప్రతీకాత్మక చిత్రం)
Senior Technician: ఈ విభాగంలో 11 మొత్తం 11 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సివిల్, metallurgy, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సన్స్, మెకానికల్, ప్రొడక్షన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా మాథ్స్ సబ్జెక్టుల్లో డిప్లొమో చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. ఐటీఐ సర్టిఫికేట్ కలిగిన వారు సైతం అప్లై చేయొచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
Technician: ఈ విభాగంలో 22 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్లలో డిప్లొమా చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. Junior Assistant: ఈ విభాగంలో మొత్తం 9 ఖాళీలను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు.(ప్రతీకాత్మక చిత్రం)
ఎలా అప్లై చేయాలంటే.. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 19లోగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అప్లికేషన్ ఫామ్ మరియు సెల్ఫ్ అటెస్ట్ చేసిన సర్టిఫికెట్ల కాపీలను మార్చి 26లోగా NIT Jamshedpur చిరునామాకు పంపించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మరిన్ని వివరాలను నోటిఫికేషన్ లో చూడొచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)