1. హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. సీనియర్ రెసిడెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన eICU పైలట్ ప్రోగ్రామ్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రామ్ కోసం పలు పోస్టుల్ని భర్తీ చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 2022 జనవరి 28 సాయంత్రం 4 గంటల్లోగా దరఖాస్తు చేయాలి. ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయాలి. అంటే పోస్టులో అప్లికేషన్ ఫామ్స్ పంపాల్సి ఉంటుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. విద్యార్హతల వివరాలు చూస్తే అనస్థీషియాలజీ, జనరల్ మెడిసిన్, ఎమర్జెన్సీ మెడిసిన్ లాంటి అంశాల్లో ఎండీ పాస్ కావాలి. క్రిటికల్ కేర్‌లో అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ, స్థలం వివరాలను అభ్యర్థులకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.80,000 వేతనం లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు https://www.nims.edu.in/recruitment ఓపెన్ చేయాలి. Recruitment of Senior Residents under the pilot program లింక్ పైన క్లిక్ చేయాలి. నోటిఫికేషన్ వివరాలతో పాటు దరఖాస్తు ఫామ్ ఉంటుంది. డౌన్లోడ్ చేయాలి. దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. తెలంగాణ ప్రభుత్వం వేర్వేరు ప్రాంతాల్లో eICU spokes ఏర్పాటు చేస్తోంది. నిమ్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌గా వ్యవహరిస్తుంది. ఈ ప్రోగ్రామ్ కోసం ప్రస్తుతం జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. కాంట్రాక్ట్ గడువు ఒక ఏడాది ఉంటుంది. రెగ్యులర్ అపాయింట్మెంట్ లభించదు. (ప్రతీకాత్మక చిత్రం)