హైదరాబాద్ లోని ప్రముఖ నిజామ్స్ ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఇటీవల పలు ఖాళీల భర్తీకి వరుసగా జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలు చేస్తోంది. తాజాగా.. మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పలు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు ఈ నెల 28ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.(ప్రతీకాత్మక చిత్రం)
అనస్తేషియాలజీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, ఎండోక్రైనాలజీ, జనరల్ మెడిసిన్, హెమటాలజీ, మైక్రోబయోలజీ, మెడికల్ జెనెటిక్స్, మెడికల్ న్యూరాలజీ, న్యూరోసర్జరీ, అర్థోపెడిక్స్ తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)