హైదరాబాద్ లోని అత్యంత ప్రతిష్టాత్మక హాస్పిటల్స్ లలో నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఒకటన్న విషయం తెలిసిందే. తాజాగా నిమ్స్ ఆస్పత్రి నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల (Jobs) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పలు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు. (ప్రతీకాత్మక చిత్రం)
డేటా ఎంట్రీ ఆపరేటర్, లేబొరేటరీ టెక్నీషయిన్, రిసెర్చ్ అసిస్టెంట్, సైంటిస్ట్ తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో (Job Notification) పేర్కొన్నారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 12వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
డేటా ఎంట్రీ ఆపరేటర్: సైన్స్ సబ్జెక్టుల్లో ఇంటర్ లేదా 12వ తరగతి పాసైన వారు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. కంప్యూటర్ పై స్పీడ్ టెస్ట్ ఉంటుంది. హెల్త్ కేర్ రంగంలో డేటా ఎంట్రీపై రెండేళ్ల అనుభవం ఉన్న వారికి ప్ారధాన్యం ఉంటుంది. వయస్సు 28 ఏళ్లలోపు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.18 వేల వేతనం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
రీసెర్చ్ అసిస్టెంట్: లైఫ్ సైన్సెస్ లో ఎంఎస్సీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.31 వేల వేతనం చెల్లించనున్నారు.సైంటిస్ట్ బీ: మైక్రో బయోలజీ/మాలిక్యూర్ బయోలజీలో పీజీ చేసి ఉండాలి. ఇతర విద్యార్హతల వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.54,500 వేతనం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఎలా అప్లై చేయాలంటే..
Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://nims.edu.in/index ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం నోటిఫికేషన్స్ విభాగంలో Recruitment ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3: అనంతరం Notification for Scientist-B - Research Assistant ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 4: తర్వాత అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)